Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానా శిబిరం

Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలో శనివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్బంగా కాసిపేట జాగృతి ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఎంపీపీ రొడ్డ లక్ష్మి, ఎంపీటీసీ అక్కేపల్లి లక్ష్మి ప్రారంభించారు. అంతకముందు పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఎంపీపీ రొడ్డ లక్ష్మి, ఎంపీటీసీ అక్కేపల్లి లక్ష్మి, జాగృతి సభ్యులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు, PRO చిన్నయ్య కో కన్వీనర్లు మద్ది లక్ష్మణ్, లస్మయ్య, బెల్లంపల్లి నియోజకవర్గ కన్వీనర్ సిడం శంకర్, కాసిపేట మండల అధ్యక్షులు సోదారి సురేష్, కనక వంశీ కృష్ణ, రత్నం అరుణ్ కుమార్, చిక్రం రాందాస్, పోతురాజుల సురేష్, ఆత్రం ప్రవీణ్, దుర్గం శేఖర్ పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App