Digital Kasipet:-
కాసిపేట మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన కనక తులసి పుట్టుకతోనే Hirschsprung's వ్యాదితో బాధపడుతుంది. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో ఈ విషయం తెలిసిన తెలంగాణ జాగృతి కాసిపేట వారు రూ.3000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ మంతయ్య, తెలంగాణ జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదరి సురేష్, కోశాధికారి కనక వంశీ కృష్ణ, కో కన్వీనర్ చిక్రం రామ్ దాస్, బుగ్గగూడ జిపి అధ్యక్షులు మరినేని పోశం, పల్లంగుండా అధికార ప్రతినిధి శ్రీహరి, జాగృతి సభ్యులు గేడం కావేరి, వసంత రావు, కిరణ్, లక్ష్మణ్, భీంరావ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.