మండలంలో ఆర్టీసీ బస్సులను పెంచాలి
Digital shivaMarch 01, 2021
Digital Kasipet:- కాసిపేట మండలంలో ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని పెంచాలని ప్రజలు, విద్యార్థులు ఇబ్భదులు పడుతున్నారని సామజిక ఛైతన్య వేదిక అధ్యక్షులు పల్లె మల్లయ్య అన్నారు. ఉదయం 9 గంటల సమయంలో దేవాపూర్ నుండి ఓకే బస్సు ఉండటం వల్ల 50 మంది వెళ్లే బస్సు లో 100 మంది ఎక్కి ప్రయాణిస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ బస్సులో ఎక్కువమంది కిక్కిరిసి ప్రయాణించడం వల్ల ప్రజలు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. దీనిపై కాసిపేట జడ్పీటీసీ పల్లె చెంద్రయ్య స్పందిస్తూ ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.