Digital Kasipet:-
PSR జిల్లాస్థాయి టోర్నమెంట్ లో భాగంగా మండల స్థాయి టోర్నమెంట్ సోమవారం కాసిపేట మండలంలోని ముత్యంపల్లి మైదానం లో ప్రారంభమయింది. పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి, ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు శ్రీ స్వర్గీయ కొక్కిరాల రఘుపతి రావు చిత్రపటానికి పూలమాల వేసి టోర్నిని ప్రారంభించారు. టోర్నీలో మొదటి మ్యాచ్ కాసిపేట, పెద్దనపల్లి జట్ల మధ్య జరగగా ముత్యంపల్లి జట్టు విజయం సాధించింది. రెండవ మ్యాచ్ మామిడిగూడ తండా, ముత్యంపల్లి జట్లు తలపడగా ముత్యంపల్లి జట్టు గెలిచింది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మార్చ్ 19న జరగనుంది. టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో నస్పూరి నర్సింగ్, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్, కుర్మ నర్సయ్య, గోలేటి స్వామి, ఆకుల పోశం, జాడి శివ, సుధాకర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
మండలంలో PSR క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
Digital shivaMarch 15, 2021