Digital Kasipet:-
కాసిపేట మండలంలోని సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ పనులను ఛీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ శ్రీ శ్రీనివాసరావు పరిశీలించారు. 15 మెగావాట్ల సోలార్ సైట్ 132 కె.వి. సబ్ స్టేషన్ బెల్లంపల్లికి అనుసంధానం కొరకు సింగరేణి అధికారులకు త్వరితగతిన పనులు జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి జి.ఎం. శ్రీ చింతల శ్రీనివాస్, ఏ.జి.ఎం. (ఈ & ఎం) శ్రీ జగన్మోహన్ రావు, డి.జి.ఎం. సోలార్ బెల్లంపల్లి రీజియన్ శ్రీ శ్రీనివాస్, డి.జి.ఎం. ఏరియా వర్క్ షాప్ శ్రీ నరసింహరాజు, ఎస్.ఈ. ఏరియా వర్క్ షాప్ కృష్ణారెడ్డి, డి.జి.ఎం. అదాని శ్రీ గోవర్ధన్, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రాజేష్ కుమార్ పాల్గొన్నారు.