Digital Kasipet:-
కాసిపేట మండలంలోని వరిపేట గ్రామంలో వ్యవసాయ శాఖ మరియు ATMA సంస్థ వారి ఆధ్వర్యంలో బుధవారం రైతులకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. జొన్నలు, సజ్జలు, రాగులు, ఓట్స్ పంటల విశిష్టతను రైతులకు తెలియజేశారు. చిరుధాన్యాల పంటలలో పురుగు మందుల వాడకం తక్కువ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాసిపేట మండల వ్యవసాయ అధికారి వందన, ఏఈఓ శ్రీధర్, ATMA నిహారిక, కోమటిచేను ఎంపిటిసి, మార్కెటింగ్ డైరెక్టర్ వాసుదేవ్, పిఎసిఎస్ విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
చిరుధాన్యాలపై రైతులకు అవగాహన
Digital shivaMarch 17, 2021