Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

దేవాపూర్ లో పౌర్ణమి ధ్యానం ప్రారంభం

Digital Kasipet:- 
కాసిపేట మండలం దేవాపూర్ పంచాయతీలోని పకృతి వనంలో ఆదివారం రాత్రి సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం ప్రారంభించారు. ఈ సందర్భంగా సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు పల్లె మల్లయ్య మాట్లాడుతూ  ఈ సృష్టిలో మనస్సును శుద్ధి చేసుకోవాలంటే  ధ్యానమార్గం ఒక్కటే శరణ్యం అని గౌతమబుద్ధుడు, రమణ మహర్షి, సుభాష్ పత్రీజీ,  పూలాజి బాబా  లాంటి మహాను భావులు తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో సా చై వే ఉపాధ్యక్షుడు మెరుగు శంకర్, ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు, పూలాజీ బాబా ధ్యాన కేంద్రం సభ్యుడు మానుకు పటేల్, టిఆర్ఎస్ మండల నాయకుడు సత్యనారాయణ,  దేవాపూర్ గ్రామం లోని అనుభవ వైద్యులు సత్తన్న, సా చై వే నాయకులు మహేష్ తదితరులు మాట్లాడారు. తదనంతరం సామాజిక వేదిక నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి ధ్యానాన్ని  ప్రారంభించారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App