Digital Kasipet:-
కాసిపేట మండలం పల్లంగుండా గ్రామంలో మంగళవారం దేవాపూర్ ఎస్ఐ విజేందర్ తన సిబ్బందితో కలసి సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాలు గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల ప్రజాప్రతినిధులను, పెద్దలను, గ్రామ ప్రజలను సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. సున్నితమైన ప్రాంతాల్లో నిఘా సిసి కెమరాలు ఎంతో కీలక ప్రాత వహిస్తాయని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పరిశీలించడానికి, ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించడానికి సిసి కెమెరాలను ఎంతోగానో ఉపయోగపడతాయన్నారు. సీసీ కెమెరాలవల్ల నేరాలు జరుగాకుండా నియత్రించవచ్చని అంతేకాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి కుడా ఉపకరిస్తాయన్నారు. ప్రజల పోలీసుల మధ్య సమన్వయంతోనే నేరాలు నియంత్రణ సాధ్యపడుతుందని తెలిపినారు. సీసీ కెమెరాల సాక్ష్యం కోర్టులో చాలా ముఖ్యమని నిందితులు తప్పించుకునే అవకాశం ఉండదని తెలిపినారు. మహిళల, ప్రజల రక్షణకు, దొంగతనాలు అరికట్టడానికి, గ్రామాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల ఉపయోగపడతాయి తెలిపారు.