Digital kasipet:-
కాసిపేట మండలం సోమగుడెం (కె) గ్రామ పంచాయతీలో శనివారం శ్రీ దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహరాజ్ గారు బోగ్ బండార్ మరియు హోమం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతిఒక్కరు చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండి అందరూ చదువుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు. సమాజం లో ప్రతిఒక పౌరుడు ఇతరులను గౌరవిస్తూ జీవించాలని బోధించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సపాట్ శంకర్, గ్రామ పెద్దలు, బంజారా కుల పెద్దలు పాల్గొన్నారు.