Digital Kasipet:-
తెలంగాణ జాగృతి కాసిపేట ఆధ్వర్యంలో సోమవారం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ గార్ల వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ గార్లు తాము నమ్మిన సిద్ధాంతం కోసం భారతమాతను రక్షించు క్రమంలో ఉరికొయ్యలను ముద్దాడి వీరమరణం పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ కో కన్వీనర్ లవుడియ శ్రీనివాస్, తెలంగాణ జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదారి సురేష్, తెలంగాణ జాగృతి మంచిర్యాల మండల అధ్యక్షులు మండే మంతయ్య, కోశాధికారి కనక వంశీ కృష్ణ, కార్యదర్శి అట్లా మల్లేష్, కాసిపేట అధ్యక్షులు దుర్గం శేఖర్, తెలంగాణ జాగృతి పల్లంగూడ అధికార ప్రతినిధి నవనందుల శ్రీహరి,జాగృతి సభ్యులు నగేష్, రాజేశం పాల్గొన్నారు.