Digital Kasipet:-
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన జంబోజు తిరుపతి లావణ్య దంపతుల చిన్న కూతురు గాయత్రి బ్లడ్ కాన్సర్ తో బాధపడుతుంది. ఇప్పటికే చికిత్స కోసం రూ.4లక్షల పైగా ఖర్చు అయ్యాయని, ఇంకా 2,3 లక్షల వరకు అవసరముందని డాక్టర్లు చెబుతున్నారని గాయత్రి తల్లితండ్రులు అన్నారు. ప్రస్తుతం గాయత్రి లకడికపుల్ MNJ కాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతా మాత్రంగా ఉండడంతో కాసిపేట మండల విశ్వబ్రాహ్మణ సంఘం వారు గాయత్రి చికిత్స కోసం దాతల ద్వారా విరాళలను సేకరించి, ఆర్థిక సహాయం అందజేయనున్నారు. మండలంలోని దాతలు ఏవరైనా సహాయం చేయాలనుకుంటే 9959155247 నెంబర్ కు Phonepe/ Gpay చేయాలనీ విశ్వబ్రాహ్మణ సంఘం వారు కోరారు.
గాయత్రి కుటుంబానికి నేరుగా సహాయం చేయాలంటే 9959816094 నెంబర్ ద్వారా సహాయపడండి.