Digital Kasipet:-
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాదేవి జయంతి ఉత్సవాన్ని కాసిపేట మండలంలోని కొండాపూర్ యాప గ్రామంలో ఆదివారం సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సామాజిక చైతన్య వేదిక నాయకులు రమాదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు పల్లె మల్లయ్య మాట్లాడుతూ దేశంలోని బహుజన సమాజం కోసం అంబేద్కర్ చేసిన ఎనలేని కృషి వెనుక రమాదేవి త్యాగం ఎంతో ఉందని అన్నారు. తాను తన పిల్లలు ఆకలితో ఉంటూ కూడా పిడకలు చేసి విక్రయించి వచ్చిన డబ్బులను రమాదేవి అంబేద్కర్ ఉన్నత చదువుల కోసం పంపించిన మహనీయు రాలని కొనియాడారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు గుడిసెల రాజేశం, మెరుగు శంకర్, ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు రమాదేవి త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రమటెంకి రాజలింగు, సహాయ కార్యదర్శి ఎంబడి కిషన్, నాయకులు కురిసింగ మోహన్ తదితరులు పాల్గొన్నారు.