Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సబ్సిడీపై అందుబాటులో పశుగ్రాసం విత్తనాలు

Digital Kasipet:-
మండలంలోని కాసిపేట గ్రామంలో గురువారం పశువైద్యాధికారి డా. తిరుపతి ఆధ్వర్యంలో మేకలు మరియు గొర్రెలకు ఉచిత PPR పారుడు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ రోజు కార్యక్రమంలో 1200 గొర్రెలు, 250 మేకలకు టీకాలు వేసినట్లు ఆయన తెలిపారు. ఈ టీకాలు వేసుకోవడం ద్వారా మేకలు మరియు గొర్రెలకు PPR ( పారుడు రోగం / దొబ్బరోగం ) రాకుండా కాపాడవచ్చని అన్నారు. అలాగే పశుగ్రాసం విత్తనాలు సబ్సిడీ పై అందుబాటులో ఉన్నాయని, అవసరం ఉన్న రైతులు పశు వైద్యశాలకు వచ్చి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆఫీస్ సబార్డినెట్ P. రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App