Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలో గురువారం తెలంగాణ జాగృతి సమావేశం ఏర్పాటుచేసి వివిధ గ్రామపంచాయతీల కార్యవర్గమూలను, కాసిపేట మండల కార్యవర్గమును జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు నియమించి నియామక పత్రాలను అందజేశారు. ముత్యం పల్లి గ్రామ పంచాయతీ అధ్యక్షులుగా కనుకుంట్ల హరీష్, కాసిపేట దుర్గం శేఖర్, గట్రావుపల్లి ఆత్రం లింగు, సోనాపూర్ బద్ది ప్రవీణ్ కుమార్,రొట్టెపల్లి ఆడే రవి,కోమటిచేను దుర్గం గణేష్, బుగ్గగూడ మరినేని పోశం, ముత్యాంపల్లి గ్రామ పంచాయతీ మహిళా అధ్యక్షరాలు పెద్దపల్లి శ్రావణి ని నియమించారు. అలాగే తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి గంగాధరి రాజ్ కుమార్, కోశాధికారి కనక వంశీ కృష్ణ, PRO ఆత్రం జంగు, కో -కన్వీనర్లు పలాగని గంగ, చిక్రం రాందాస్, బింగి చెందు, రత్నం అరుణ్ కుమార్, కార్యదర్శి అట్లా మల్లేష్, ఆడే శేఖర్ ని నియమించారు. నూతనంగా నియామకమయిన వారు జాగృతి ఆశయాల కొరకు కృషి చేయాలని, సమాజానికి వివిధ రకాల సేవలను అందించాలని జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో -కన్వీనర్ మద్ది లక్ష్మణ్, కో -కన్వీనర్ బండారి లస్మయ్య, తెలంగాణ జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదరి సురేష్ పాల్గొన్నారు.