Digital Kasipet:-
మండలంలోని కాసిపేట గ్రామంలో శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జడ్పీటీసీ పల్లె చంద్రయ్య తెరాస మండల అధ్యక్షులు రమణారెడ్డి, వైస్ ఎంపీపీ విక్రంరావు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాసిపేట పంచాయతీలో 450క్రీయాశీల, 1250సదారణ సభ్యత్వాలు చేసుకోవాలని, సభ్యత్వాలు చేసుకున్న వారికి ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందన్నారు. కాబట్టి ఎక్కువ మోతాదు లో సభ్యత్వాలు చెపించాలని పార్టీ శ్రేణులకు వారు సూచించారు. ఈకార్యక్రమంలొ పిఎసిఎస్ చైర్మన్ నీలరాంచంధర్, ఎంపీటీసీ అక్కెపల్లి లక్ష్మి, మాజీ జడ్పీటీసీ రౌతు సత్తయ్య, సర్పంచ్ సంపత్ నాయక్, ఉప సర్పంచ్ సుమన్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మొటూరి వేణు, అగ్గి సత్తయ్య, జాడీ రాంచెందర్, వార్డ్ మెంబర్లు అగ్గి వెంకటేశ్వర్లు, శంశీర్, రేణుక మల్లేష్, సిలొజు శ్రీనివాస్, ఉసికమల్ల గోపాల్, నాయకులు దుర్గం రాంచందర్, అచ్యుతరావు, రాజన్న తదితరులు పాల్గొన్నరు.