Digital Kasipet:-
కాసిపేట మండలంలోని గుర్వపూర్ గ్రామంలో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొని సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందినవారికి ప్రమాద భీమా సౌకర్యం ఉందన్నారు. అలాగే గుర్వపూర్ గ్రామానికి బ్రిడ్జి, రెగులగుడెం నుండి చింతగుడేం వరకూ బిటి రోడ్డు మంజూరు అయింది త్వరలో పనులు జరుగుతాయని తెలిపారు. అలాగే గుర్వాపుర్ గ్రామంలోకి వచ్చే రోడ్డుకు కుడా మంజూరుకు కృషి చేస్తామని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతరం రెగులగుడెం గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనీఖీ చేసి విధ్యార్థులు హాజరు శాతం, టీచర్ల విధులును పరిశీలన చేసి, పలు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రంరావు, తెరాస ప్రెసిడెంటు రమణారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నీలా రాంచెందర్, సర్పంచ్ ఆడె బాదు, ఎంపిటిసి అక్కేపల్లి లక్ష్మి, మాజీ జడ్పిటిసి రౌతు సత్తయ్య, సిరాజ్, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, నాయకులు మొటూరి వేణు, అగ్గి సత్తి, లంక లక్ష్మణ్, జాడి రాంచెందర్,సురేందర్, మదన్మోహన్ రావు,ప్రెంకుమార్,రేణుక మల్లేష్ శంకర్,నాయకులు ప్రజలు పాల్గొన్నరు.