Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి, ధర్మారావుపేట గ్రామాల్లో నిర్మించిన రైతువేదికలను గురువారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ ఈ రైతువేదికలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కల్యాణి బీమా గౌడ్, రైతు సమితి జిల్లా అధ్యక్షులు గురువయ్య, ఎంపీపీ లక్ష్మీ గారు, జడ్పీటీసీ చంద్రయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గం పోశం, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, TRS నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.