Digital Kasipet:-
మండలంలోని కాసిపేట రైతువేదికలో శుక్రవారం మండల వ్యవసాయ అధికారి వందన రైతులతో సమావేశమై వివిధ అంశాలపై అవగాహనా కల్పించారు. యాసంగి పంట నమోదు, పప్పు దినుసుల పంటల ప్రాధాన్యత ను రైతులకు వివరించారు. ఇకపై వారానికి రెండు సార్లు రైతువేదికలలో రైతులకు వివిధ అంశాలపై అవగాహనా కల్పించానున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో విలేజ్ ఆర్.బి.ఎస్ కోర్డినేటర్ గోడిసేలా భీమయ్య, పిఏసిఎస్ సీఈఓ రాజశేఖర్, ఏఈఓ శ్రీధర్, రైతులు పాల్గొన్నారు.