Digital Kasipet:-
కాసిపేట మండలంలోని పల్లంగూడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండ్ల రమా అనే మహిళా బావిలో శవమై కనిపించింది. పూర్తి వివరాలలోకి వెళ్తే రమా భర్త సత్తయ్య మూడురోజుల క్రితం ఊరికి వెళ్ళాడు. గురువారం ఇంటికి తిరిగివచ్చి చూసేసరికి తన భార్య కనిపించకపోవడం, అలాగే వాసన కూడా రావడంతో బావిలో చూసేసరికి శవమై కనిపించింది. స్థానికులు సమాచారం ప్రకారం రమా ఆరోగ్య సమస్యలతో (పక్షవాతం) బాధపడుతుందడంతో మనస్థాపనికి గురై ఆత్మహత్య చేసున్నట్లు తెలుస్తుంది. శుక్రవారం ఉదయం మృతదేహనికి పోస్టుమార్టం చేయనున్నారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.