Digital Kasipet:-
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు రామ మందిరానికి నిధి సేకరిస్తున్న వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ, బీజేవైఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రామ భక్తులపై, బీజేపీ నాయకుల పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని, దాడిని కండించాలని కాసిపేట తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాసిపేట మండల బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సూరం సంపత్ మాట్లాడుతూ రామ భక్తులపై దాడి చేసిన తెరాస నాయకులపై కేసులు నమోదుచేసి, అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు ఆట్కాపురం రమేష్, కాసిపేట మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు పెరుగు రాజు, మండల ఉపాధ్యక్షులు పోలవేణి పోషం, బిజెపి సీనియర్ నాయకులు దుర్గం దుర్గయ్య, బిజెపి కార్యకర్తలు అరవింద్, కిరణ్, రమేష్ పాల్గొన్నారు.