Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

టోర్నమెంట్ ఫైనల్ లో రాయల్స్ జట్టు విజయం

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లిలో సోమవారం మారం జూకాజ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఫైనల్ లో దేవాపూర్ 007 జట్టు మరియు రాయల్స్ జట్టు తలపడగా రాయల్స్ జట్టు విజేతగా నిలిచింది. విజేత జట్టు కి కాసిపేట ఎస్సై రాములు, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్ ల చేతుల మీదుగా బహుమతి అందజేశారు. అనంతరం కాసిపేట ఎస్సై రాములు మాట్లాడుతూ ఆటలు మానసికోల్లాసానికి, శరీర ధృడత్వానికి చాలా అవసరం అని, పిల్లలు రోడ్లపై జాగ్రత్తగా వాహనాలు నడపాలని మద్యం, ధూమపానం వంటి వ్యసనాలకు లోను కాకుండా ఉండాలని సూచించారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారికి మా సహాయం ఉంటుంది అని తెలిపారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App