Digital Kasipet:-
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన జంబోజు తిరుపతి లావణ్య దంపతుల చిన్న కూతురు గాయత్రి బ్లడ్ క్యాన్సర్తో బాధ పడుతుంది. ఈ విషయం తెలిసిన మండల విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మరియు మన వంతు సేవా సంస్థ వారు విరాళాలు సేకరించి గాయత్రి కుటుంబానికి రూ.12,500 అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్థికసహాయం చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో చింతల మహేష్ చారి, గొల్లపల్లి రాజేందర్ చారి, శ్రీనివాస్ చారి, వెంకటేష్ చారి, కమలాకర్ చారి, విక్రమ్ చారి, గద్దలపెళ్లి పూర్ణచందర్ చారి పాల్గొనడం జరిగింది.
కాన్సర్ తో పోరాడుతున్న గాయత్రి కి సహాయం చేద్దాం.