Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రైతు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుల నిరసన

Digital Kasipet:-
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమగూడెం జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. సుమారు 2 గంటల పాటు ధర్నా చేయగా ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీస్ లు ఆందోళనను విరమింపజేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కారుకూరి రాంచందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకి తీరని అన్యాయం చేస్తుందని, రైతాంగాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెడుతుందని ఆరోపించారు. వెంటనే ఈ నల్ల చట్టాలని వెనక్కి తీసుకోవాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్తె భూమయ్య, చుంచు మల్లమ్మ, వేముల కృష్ణ, గోమాస భీమయ్య, ప్రవీణ్, ST సెల్ మండలం ప్రెసిడెంట్ గుండా రాజకుమార్, జైన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App