Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రామమందిర నిర్మాణానికి రూ.51,111 అందజేసిన ఓసీసీ అధ్యక్షులు

Digital Kasipet:-కాసిపేట మండలంలోని దేవపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ కాలనిలో అయోధ్య రామమందిర నిర్మాణం నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ పాల్గొని విరాళాలను సేకరించారు. రామమందిర నిర్మాణం కోసం ఓరియంట్ కంపెనీ చైర్మన్ ఎస్.కె పాండే 51,111 రూపాయలు సమర్పించారు. అదేవిదంగా కంపెనీ యూనియన్ హెడ్ ఆర్.వి మూర్తి, వివిధ డిపార్ట్మెంట్ HOD లు, జనరల్ మేనేజర్ లు పాల్గొని తమ వంతుగా విరాళలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాసిపేట మండల బిజెపి అధ్యక్షులు కాల్వ సతీష్ రెడ్డి, మండల పదాదికారులు, వివిధ మోర్చాలా అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App