Digital Kasipet:-
కాసిపేట మండల పరిధిలోని దేవాపూర్, నాయికగూడెం, ఇప్పలగూడెం, రేకులగూడెం, తుడుంగూడెం గ్రామాలలో శనివారం బీజేపీ నాయకులు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి నిధి సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కాసిపేట మండల ప్రధాన కార్యదర్శి దేవునురి సంతోష్, జిల్లా కిషన్ మోడ్చ ఉపాధక్షుడు అట్కాపురం రమేష్, బీజేపీ కాసిపేట మండల ఉపాధ్యక్షులు మాజీ బాలాజీ, బీజేపీ నాయకులు పెంచల రాజకుమార్, ఎలం రాజకుమార్ పాల్గొన్నారు.