Digital Kasipet:-
కరోనా వ్యాక్సిన్ ప్రభావంతోనే అంగన్వాడీ టీచర్ సుశీల మరణించిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే ఇతర జబ్బులతో మరణించిందని, అధికారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని CITU, CPM నాయకులు ఆరోపించారు. ఆరోగ్యంగా ఉన్న దివ్యంగురాలైన సుశీలకు టీకా వేసిన తర్వాతనే ఆరోగ్యం చెడిపోయి మరణించిందని కానీ ప్రభుత్వాలు, అధికారులు తమ తప్పులను కప్పిపు చ్చుకోడం కోసం సుశీలకు లేని జబ్బులను అంటగట్టుతు తప్పుడు ప్రచారం చేస్తూ కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని అన్నారు. సుశీల ఇంటికి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్.త్రివేణి వెళ్లి సుశీల మరణించడానికి గలకారణాలు, ఆరోగ్య పరిస్థితి, వైద్య వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకోక ముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వ్యాక్సిన్ వేసిన తర్వాతనే ఒంటి నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిరసించిపోడం జరిగిందని వ్యాక్సిన్ వేసుకోవడం వలనే సుశీల మరణించిందని, కుటుంబ సభ్యులు నాయకులకు తెలిపారు. అధికారులు తమ తప్పుడు ప్రచారం మానుకొని సుశీల కుటుంబ సభ్యులకు న్యాయం చెయ్యాలని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, వ్యాక్సిన్ వేసుకొని అనార్యోగల పాలైన వారందరికీ మెరుగైన వైద్యం చేయించాలని సీఐటీయూ, సీపీఎం నాయకులు డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకే రవి, నాయకుల ఎస్.వెంకటస్వామి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గొడిసెల చంద్ర మొగిలి, ఉపాధ్యక్షురాలు భానుమతి, నాయకులు మంగమతి పాల్గొన్నారు.