Digital Kasipet:-
కాసిపేట మండలం సోనాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 158వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొట్నాక సుశీల - శంకర్ స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశంలో సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ దేశం కోసం తమ ప్రాణత్యాగాలు అర్పించిన మహనీయుల గురించి మారుమూల ప్రాంతాల ప్రజలకు వారు దేశానికి చేసిన సేవలు తెలియ చెప్పాలనే ఉద్దేశంతో నే సోనాపూర్ పంచాయితీలో వివేకానంద జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నాయక్ పొడు సేవా సంఘం మండల అధ్యక్షుడు బద్ది శ్రీనివాస్ మాట్లాడుతూ వివేకానంద స్వామి నేటి యువతరానికి ఆదర్శప్రాయుడని యువతరం అతడిచ్చిన సందేశాలను ఆచరణలో పెడితే అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు. సమావేశంలో సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాబు, నాయకపోడ్ సోనాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు భీంసేన్, సోనాపూర్ గిరిజన నాయకుడు మురళి మహారాజు, పులజి బాబా ధ్యాన కేంద్రం సభ్యుడు మానుకు, స్థానిక ప్రజల పాల్గొన్నారు.