Digital Kasipet:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ నాయకపుగూడలో ఆదివాసీ నాయక్ పోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సేవలను కొనియాడారు.