Digital Kasipet:-
కాసిపేట మండలంలోని సండ్రల్ పహాడ్ గ్రామంలో కొందరు వ్యక్తులు అడవి అలుగును అమ్మడానికి ప్రయత్నించగా రామగుండము టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుగ్గ గుట్ట ప్రాంతంలో అడవి అలుగు తిరుగుతుందనే సమాచారంతో శుక్రవారం రాత్రి ఉచ్చు వేసి అలుగు ని పట్టుకున్నారు. దానిని కొంతమంది దళారులకు చూపించి కోటిన్నరకు అమ్మే ప్రయత్నం చేస్తుండగా పోలీసులకు సమాచారం అందడంతో వారిని పట్టుకొని వారి వద్ద నుండి మూడు బైక్ లు, ఎనిమిది సెల్ ఫోన్లు, ఒక న్యూస్ పేపర్, కత్తి, స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ టాస్క్ లో టాస్క్ ఫోర్స్ సీఐ టి. కిరణ్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు శ్రీ లచ్చన్న, శ్రీ సి హెచ్ కిరణ్ మరియు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ సంపత్ కుమార్, రాకేష్, భాస్కర్ గౌడ్, శ్రీనివాస్, ఓంకార్, శ్యామ్, సదానందం గౌడ్, వెంకటేష్ పాల్గొన్నారు.