Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలో శుక్రవారం నూతన ప్రెస్ క్లబ్ భవనాన్ని బెల్లంపల్లి ఆర్డివో శ్యామల దేవి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రిపోర్టర్లు చీకటిలో ఉంటూ సమాజంలో వెలుగులు నింపుతారని ప్రశంసించారు. ప్రెస్ క్లబ్ కార్యాలయానికి అవసరమైన ఫర్నిచర్ ని తాను అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్, ఓసీసీ ప్రసిడెంట్ పాండే, పిఏసిఎస్ చైర్మన్ నీల రాంచందర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.