Digital Kasipet:-
కాసిపేట మండలంలోని చిన్నాధర్మారం గ్రామంలో బీజేవైఎం ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల రక్షణ కొరకు కరోనా వ్యాక్సిన్ ని అందిస్తుందని హార్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు సురేష్ చిన్న, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, బిజెపి నాయకులు సూరం సంపత్ కుమార్, కుడికాల చిన్న మల్లయ్య, సూత్రాల కార్తీక్, కడియాల సాయి కుమార్, వుడె శ్రీకాంత్, సూరం మనోజ్, రుద్ర రంజిత్, పత్తిపాక సతీష్, పులగం రితీష్, మహిళా కార్యకర్తలు మైదం సాయి కీర్తన, సంజన, రితిక శ్రీ, నిత్య, గ్రామస్తులు పాల్గొన్నారు.