Digital Kasipet:-
11వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని కాసిపేట ఎంపీడీవో కార్యాలయంలో ఆవరణలో సోమవారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మీ, జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, మండల ఉపాధ్యక్షుడు పూస్కూరి విక్రం రావు, సహకార చైర్మన్ నీలా రాంచందర్. రైతు సమితి అధ్యక్షుడు దుర్గం పోశం, అగ్గి సత్తయ్య, రాంచందర్. రొడ్డ రమేష్, సర్పంచ్ లు ఎంపీటీసీ లు తదితరులు పాల్గొన్నారు.