Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మాజీ ఎంపి వివేక్ ఆధ్వర్యంలో బీజేపీలో భారీ చేరికలు

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో మంగళవారం మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో 50 మంది యువకులు బీజేపీ లో చేరారు. ఈసందర్బంగా వివేక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంటికొక ఉద్యోగం ఇస్తామని, ఆర్థులందరికి డౌబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకంలో కరోనా చికిత్స అందుబాటులో ఉండగా ముఖ్యమంత్రి కెసిఆర్  తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. కాసిపేట మండలంలో పెద్దఎత్తున యువకులు బీజేపీలో చేరుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App