Digital Kasipet:-
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీలోని నాయకపుగూడెం గిరిజన గ్రామంలో లయన్స్ క్లబ్ 320జి ఆధ్వర్యంలో 300 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్ యన్.వి రావు, 320 జి రీజియన్ చైర్మన్ గోపాల కృష్ణ మాట్లాడుతూ ఈ రీజియన్ లో జిల్లా గవర్నర్ ఆదేశాల మెరకు అంగర్ రీలీఫ్ కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాల సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లయన్ క్లబ్ ఆఫ్ సోమగూడెం అధ్యక్షుడు వేముల కృష్ణ, జిల్లా చైర్మన్ కట్కూరి సత్యనారాయణ, జోన్ చైర్మన్ ఢికొండ రాజలింగం, బెల్లంపల్లి క్లబ్ అధ్యక్షుడు సుదర్శన్, దేవాపూర్ క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.