Digital Kasipet:-
కాసిపేట తెలంగాణ జగృతి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బుధవారం భోగిమంటలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ మద్ది లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజలు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ చెడు మీద మంచి విజయం సాధించాలని కోరారు. ప్రజలందరికి భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ కో కన్వీనర్ లావుడ్య శ్రీనివాస్, కాసిపేట మండల అధ్యక్షులు సోదారి సురేష్, జిల్లా నాయకులు మాడే మంతయ్య, ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, కాసిపేట ఎం పి టీ సి అక్కేపల్లి లక్ష్మి, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, జాగృతి జీపి అధ్యక్షులు గంగాదరి రాజకుమార్, రత్నం అరుణ్ కుమార్, చక్రం రాందాస్, సురం వినోద్, బింగి చందు, సభ్యులు కనక వంశీ కృష్ణ, గిన్నె రాజం, బిమయ్య పాల్గొన్నారు.