Digital Kasipet:-
కాసిపేట మండలంలోని వాగు నుండి ప్రభుత్వం అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్ లను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లుతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎవరైన అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ టాస్క్ ఫోర్స్ లో సిబ్బంది వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శ్యాం సుందర్ లు పాల్గొన్నారు.