Digital Kasipet:-
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలనికి చెందిన చిరు వ్యాపారి పొట్ట బత్తుల సంపత్ కుమార్తె స్నేహిత వివాహానికి కానుకగా గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ దంపతులు రూ.5,016 పాటు చీర అందజేశారు. జీవితాంతం సుఖసంతోషాలతో ఆయురారోగ్యలతో అష్టఐశ్వర్యాలతో పిల్లపాపలతో మంచి జీవితం గడపాలని అశిస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు బన్న హిందూమతి, కంచర్ల పద్మ, కొత్త రమేష్, పంబాల తిరుపతి, బొల్లపెల్లి కొమురక్క, గ్రామ పెద్దలు గాదం గట్టయ్య, కూకట్ల దేవెందర్ లు పాల్గొన్నారు.