Digital Kasipet:-
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామంలో బుధవారం జరిగిన వెంగళరావు మరియు నర్సింగరావు స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ లో చిన్నదార్మారం జట్టుపై ముత్యంపల్లి జట్టు గెలుపొందింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్యఅతిధిగా పాల్గొని గెలుపొందిన జట్టుకు ట్రాఫి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మీ, వైస్ ఎంపిపి విక్రమ్, జడ్పీటీసీ చంద్రయ్య, మండల TRS పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.