Digital Kasipet:-
కాసిపేట మండలంలోని కోమటిచేను శివారులో ఉన్న ఇనాం భూములను సాగులో ఉన్న రైతులకే పట్టాలు చేయాలనీ మంచిర్యాల జిల్లా తుడూం దెబ్బ అధ్యక్షులు కురుసెంగ వెంకటేశ్వర్ డిమాండ్ చేశారు. కాసిపేట మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇనాం భూములలో ఇస్తానుసారంగా పట్టాలు చేసారని, అధికారులు విచారణ జరిపి సాగులో ఉన్నవారికి పట్టాలను ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు గుమ్మడి రాంచందర్, జాడి శంకర్, మంద తిరుపతి పాల్గొన్నారు.