Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

హోరా హోరు పోరులో ఉపసర్పంచుల జట్టు గెలుపు

Digital Kasipet:- 
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయాని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. శుక్రవారం కాసిపేట మండలం ముత్యంపల్లి క్రీడా మైదానంలో శుక్రవారం సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఆయన పాల్గొన్నారు. ఈ టోర్నీ లో సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రెస్ క్లబ్, అధికారులతో సంయుక్తoగా జట్లు చేయగా మూడు జట్లు పాల్గొన్నాయి. మొదట డ్రా తీయగా ఉప సర్పంచ్ ల జట్టు బైలాస్ లో నేరుగా ఫైనల్ కు చేరిoది. మొదటి మ్యాచ్ లో సర్పంచ్, ప్రెస్ క్లబ్ జట్టు తలపడగా హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో కాసిపేట ప్రెస్ క్లబ్ గెలిచి ఫైనల్ కు చేరుకున్నారు. అనంతరం ఫైనల్లో ఉప సర్పంచ్, ప్రెస్ క్లబ్ జట్లు  తలపడగా కాసిపేట ప్రెస్ క్లబ్ రన్నర్ గా, ఉప సర్పంచ్ ల జట్టు విన్నర్ గా  నిలిచాయి. సర్పంచుల జట్టుకు జాకీర్, ఉప సర్పంచ్ ల జట్టుకు బోయిని తిరుపతి, ప్రెస్ క్లబ్ జట్టుకు శ్రీధర్ క్యాప్టన్ లుగా వ్యవహారించారు. అనంతరం గెలుపొందిన జట్లకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బహుమతులు అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులకు  స్నేహపూరిత వాతావరణంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం బాగుందని అన్నారు. టోర్ని ని నిర్వహించిన సర్పంచ్లలను ఎమ్మెల్యే అభినందించారు. శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని, అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా ఇలాంటి స్నేహపూరిత వాతావరణంలో క్రికెట్ టోర్నీ నిర్వహించి ఆనందంతో పాటు శారీరక దృఢత్వాన్ని కూడా ఆయన  పొందాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జడ్పిటిసి పల్లె చంద్రయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, సహకార చైర్మన్ నీలా రాంచందర్, ఎంపీడీఓ ఎంఏ అలీం, ఎంపీవో సఫ్ధర్ అలీ, రైతు సమితి అధ్యక్షుడు దుర్గం పోశం, ఎంపీటీసీ అక్కేపల్లి లక్ష్మీ, అగ్గి సత్తయ్య, మొటూరి వేణు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, జర్నలిస్ట్ లు, నాయకులు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App