Digital Kasipet:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ లో నూతనంగా భాద్యతలు చేపట్టిన ఎస్ఐ విజయేందర్ ని కాసిపేట తెలంగాణ జాగృతి వారు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదారి సురేష్ ఆధ్వర్యంలో శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఆయా గ్రామ పంచాయతీల అధ్యక్షులు మంతెన రమేష్, గంగాధరి రాజ్ కుమార్, చిక్రం రాందాస్, పోతురాజుల సురేష్, జాగృతి నాయకులు, కనక వంశీ కృష్ణ, కుర్సెంగా వసంతరావు, గేడం లక్ష్మణ్, కనుకుంట్ల హరీష్ పాల్గొన్నారు.