Digital Kasipet:-
కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలను ఏర్పాటు చేయాలని కాసిపేట మండల బిజెపి కార్యదర్శి బానోతు రవి నాయక్ డిమాండ్ చేశారు. దేశంలో కరోనా కట్టడికి, వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి రావడానికి ప్రధాని నరేంద్రమోడీ విశేషంగా కృషి చేశారని అన్నారు. అతి తక్కువ కాలంలో దేశ ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రవి నాయక్ తెలిపారు. ప్రస్తుతం మొదటి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందజేస్తున్నారని, త్వరలో ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రధాని మోడీ ప్రకటించారని అన్నారు. కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రధాని మోడీ ఫోటోలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.