Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాసిపేట మండలంలో ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్

Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఎంపీపీ రొడ్డ లక్ష్మి కరోనా వ్యాక్సినేషన్ ని ప్రారంభించారు. కాసిపేట మండలంలో తొలి కరోనా టీకాను పీ.హెచ్.సి సిబ్బంది గోపి వేసుకున్నారు. తొలి విడతలో భాగంగా ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కరోనా టీకాను వేసుకోనుండగా, తొలిరోజు మొత్తం 95 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ టీకాను సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా Covid-19 ప్రోగ్రాం ఇంచార్జి ఆఫీసర్ డా.బాలాజీ, DM&HO డా. నీరజ, డా. కిరణ్మయి, జడ్పీటీసీ పల్లె చెంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్, పిఏసిఎస్ చైర్మన్ నీల రాంచందర్, ఎంపీడీఓ ఎంఏ అలీం, ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, కాసిపేట సర్పంచ్ దారావత్ దేవి, ఫ్రంట్ లైన్ వారియర్లు, తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App