Digital Kasipet:-
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల (పంటల) కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు కొక్కిరాల సురేఖప్రేంసాగర్ గారు రైతులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు. గ్రామాలలో ఐ.కె.పి కేంద్రాల చేత, సహకార సంఘాల చేత పంటల కొనుగోలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు పంటలకు మద్దతుధర భరోసా ఇవ్వాలని కాసిపేట మండల MRO గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో కాసిపేట మండల్ ప్రెసిడెంట్ సిద్ధం. తిరుపతి, పెద్దనాపల్లి సర్పంచ్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వేముల. కృష్ణ, Tpcc లీగల్ సెల్ వైస్ చైర్మన్ కాంపెల్లి. ఉదయ్ కాంత్, TPCC ఆర్గనిసింగ్ సెక్రటరీ బండి ప్రభాకర్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీ రొడ్డ శారదా,sc సెల్ రస్తా కార్యదర్శి జమ్మికుంట విజయ్, NSUI జిల్లా ప్రెసిడెంట్ ఆదర్శ్ వర్ధన్ రాజు, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ పెంట రజిత, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ముడిమడుగుల మహేందర్, ధర్మారావు పేట MPTC పార్వతి మల్లేష్, మల్కెపల్లి mptc భీంరావ్, దేవాపూర్ 2:MPTC మెరుగు పద్మ శంకర్, ఓరియంట్ సిమెంట్ కాంట్రాక్టు నాయకులు అన్నం కుమార్, కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్, NSUI, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాలుగోన్నారు.