Digital Kasipet:-
కాసిపేట మండలం దేవాపుర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొలం గూడాలో సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యటించి వారి కుల దేవుళ్ళ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడా ఉన్న గిరిజనులతో వారి సమస్యలను అడిగి తెలుసుకొని గిరిజన గుడాల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని త్వరలోనే సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. OCC వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతి రెడ్డి అన్న ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ఇటీవల మరణించడంతో వారిని పరామర్శించారు. అలాగే దేవాపూర్ లోని పల్లె పకృతి వనాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు రమణా రెడ్డి, వైస్ ఎంపీపీ పి.విక్రమ్ రావు, సర్పంచ్ పెంద్రం రాజు, ఆడే జంగు, ఎంపీటీసీలు కొండబత్తుల రాంచందర్, ఉప సర్పంచ్ రవీందర్, విలేజ్ ప్రెసిడెంట్ గడ్డం పురుషోత్తం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.