Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

యాసంగి పంట వివరాలను పరిశీలించిన బెల్లంపల్లి ఏడిఏ

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని కోమటిచేను, కొండాపూర్, సండ్రల్ పాడ్ గ్రామాలలో బుధవారం యాసంగి పంట నమోదు కార్యక్రమంలో ఏడిఏ సురేఖ పాల్గొన్నారు. పంటల సాగుకు అవసరమయ్యే ఎరువులు, పురుగుమందుల కొరత లేకుండా అందుబాటులో ఉంచడం కొరకు పంటల వివరాల సేకరణ ముఖ్యమని ఆమె అన్నారు. యాసంగిలో రైతులు పండిస్తున్న పంటల వివరాలను సరిగ్గా నమోదు చేయాలని ఏఈఓ లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వందన, ఏఈఓ లు తిరుపతి, శ్రీధర్ పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App