Digital Kasipet:-
కాసిపేట మండలం చిన్న ధర్మారం గ్రామంలోని బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సూరం సంపత్ నివాసంలో ఆదివారం మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని రోడ్లు, వంతెనలు, త్రాగునీటి సమస్య, ఓ.సి & సింగరేణిలో భూనిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మండలంలోని పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని, యూవతకు నిరుద్యోగ భృతి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాసిపేట మండల బీజేపీ అధ్యక్షులు సతీష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన EWS బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల గత రెండు సంవత్సరాలుగా తెలంగాణా లోని అగ్రవర్ణాలో ఉన్న పేదలు చాల నష్ట పోయారని అన్నారు. EWS బిల్లును తెలంగాణా లో అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ చాలా రోజులుగా ఉద్యమాలు చేస్తుందని గుర్తుచేశారు. బిల్లును తీసుకువచ్చినందుకు నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఇంఛార్జి కొయ్యల ఏమాజి, జిల్లా ముఖ్య అధితి మాసు రజని, మండల ఇంచార్జ్ బోలెడ్ల కేశవ రెడ్డిగారు, జిల్లా నాయకులు, మండల పదాది కారులు పాల్గొన్నారు.