Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

Digital Kasipet:-
కాసిపేట మండలంలో మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగురవేసి జండా వందనం చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ఎంఏ అలీం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేవాపూర్ గ్రామంలో తెరాస పార్టీ మండల అధ్యక్షులు రమణ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరావేయగా, బీజేపీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి జండాకు గౌరవ వందనం చేశారు. కాసిపేట కోదండ రామాలయ దేవస్థానంలో విశ్వబ్రాహ్మణ సంఘం వారు గణతంత్ర వేడుకలను ఉత్సవంగా జరిపారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App