Digital Kasipet:-
మంచిర్యాల జిల్లా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మహిళా అధ్యక్షులు శ్రీమతి మాధవిగారి ఆధ్వర్యంలో చెన్నూర్ మండలంలోని అంగరాజ్ పల్లి గ్రామంలో సంక్రాతి సంబురాలలో భాగంగా జిల్లా స్థాయి ముగ్గుల పోటీలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. జనవరి 12 న ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని, ఆసక్తి ఉన్నవారు ఉదయం 8గంటలకు అంగరాజ్ పల్లి చేరుకోవాలని అన్నారు. ఉత్తమ పోటీదారులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న వారందరికీ బహుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 13 న ఉదయం 4గంటలకు కాసిపేట జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో జాగృతి మండల అధ్యక్షులు సోదారి సురేష్ ఆధ్వర్యంలో బోగీ మంటల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు జిల్లా మహిళ అధ్యక్షులు మాదవి, యువజన జిల్లా అధ్యక్షులు మేడి రాజశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి పత్తి సత్తయ్య, కోశాధికారి పడాల వెంకటేశ్వర్ గౌడ్, కో కన్వీనర్ మద్ది లక్ష్మణ్, సాహితీ విభాగం అధ్యక్షులు దుర్గం రాజేశం గౌడ్, మంచిర్యాల మండల అధ్యక్షులు మాడే మంతయ్య, నాయకులు మల్లేశం పాల్గొన్నారు.