బెల్లంపల్లి రూరల్ : తాళం వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగ తో పాటు అతనికి సహకరించిన మహిళను బెల్లంపల్లి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 10,73,550 విలువైన 18 తులాల బంగారం, వెం డి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బెల్లంపల్లి రూరల్ సీఐ కార్యాలయంలో సోమవారం మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించా రు. సోమగూడెం కొత్తకాలనీకి చెందిన బండ సంపత్ అలియాస్ సిద్ధు (29) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అదే కాలనీకి చెందిన బండారు లక్ష్మి (43) వద్ద పెరిగాడు. జల్సాలకు అలవాటు పడి చోరీలు చే స్తూ సొత్తును లక్ష్మికి ఇచ్చేవాడు. అనేక సార్లు జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ మార్పు రాకపోవడంతో రామకృష్ణాపూర్ పోలీసులు 2020 జనవరిలో పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపారు. 2020 జూలై చివరి వారంలో బెయిల్పై విడుదలయ్యాడు.
తర్వాత మళ్లీ చోరీలకు పాల్పడి సొత్తును లక్ష్మికి ఇచ్చాడు. భూపాలపల్లిలోని ఓ ఇంట్లో దొంగతనం చేసి తిరుగుతుండగా అక్కడి పోలీసులు పట్టుకొని సొత్తును స్వాధీనం చేసుకొని పరకాల జైలుకి పంపించారు. అనంతరం ఇంటికి వచ్చాక బంగారు అభరణాలను అమ్మేందుకు ఆదివారం మధ్యాహ్నం బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో ఆటో కోసం ఎదురుచూస్తుండగా పోలీసులు పట్టుకొని విచారించగా, నేరాన్ని అంగీకరించారు. బండారు లక్ష్మిని కూడా అదుపులోకి తీసుకొని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని వారిని సోమవారం రి మాండ్ కు తరలించారు.
బెల్లంపల్లి ఏసీపీ రహమాన్, బెల్లంపల్లి రూరల్ సీఐ కే జగదీష్, తాళ్లగురిజాల, రామకృష్ణాపూర్ ఎస్ఐలు సమ్మయ్య , కటికె రవిప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, కానిస్టేబుళ్లు బాలకృష్ణ, సంపత్, వెంకటేశ్, శ్రీనివాస్, రఫీ, హోంగార్డు హాజీను డీసీపీ అభినందించి నగదు పురస్కారాలను అందజేశారు. సమావేశంలో బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ హెచ్ వో రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.